రాజీ మార్గమే రాజ మార్గం - అదే లోక అదాలత్ ఉద్దేశం.

by సూర్య | Wed, Jun 22, 2022, 12:32 PM

ఈనెల 26న  జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కరించబడేలా ప్రయత్నం చేస్తున్నాం అని జిల్లా న్యాయశాఖాధికారులతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ తెలియజేసారు. 26న జరగనున్న జాతీయ లోక అదాలత్ లో సాధ్యమైనన్ని పెండింగ్ కేసులు పరిష్కరించబడేలా చూడాలని జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవల సంస్థ చైర్మన్ పార్థసారథి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న 3417 కేసులను కనుగొనడం జరిగినదని, వాటిలో 1069 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడే విధంగా ఉన్నాయని, వీటిలో 789 మందికి లోక్ అదాలత్ గురించి వివరిస్తూ నోటీసులు అందించామని, మిగిలిన 280 మందికి కూడా వీలైనంత త్వరలో నోటీసులు అందిస్తామని ఎస్పీ తెలిపారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM