వైసీపీ పార్టీకి ఊడిగం చేయడమేంటి ఐపీఎస్ మణికంఠ ?

by సూర్య | Wed, Jun 22, 2022, 12:23 PM

తెర వెనుక కోటి రూపాయిలు చేతులు మారాక అక్రమంగా అయ్యన్న ఇంటి గోడ కూల్చాలి కాబట్టే రాజ్యాంగ వ్యతిరేకంగా అర్ధరాత్రి వచ్చారు అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. వేల మంది పోలీసులతో నర్సీపట్నంలో యుద్ధ వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులని హౌస్ అరెస్టులు చేశారు. జగన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్థుడు బీసీలపై కక్ష సాధిస్తుంటే ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న పోలీస్ వారు ఇలా దిగజారి వైసీపీ పార్టీ కి రాజకీయ ఊడిగం చేయడమేంటి ఐపీఎస్ మణికంఠ ? అని ఆగ్రహం వ్యక్తపరిచారు. అంటే అయ్యన పాత్రుడి ఇంటి గోడ పడగొట్టిన పనిలో పోలీస్ వారు వైసీపీ వారితో కుమ్మకై డబ్బుకి అమ్ముడుపోయారని తెలియజేస్తున్నారు. ఐతే ఇందులో ఆరోపించడమే కాకుండా పేరుతో సహా చెప్పడం అనేది గమనార్హం. ఇందుకు సంభందించి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో స్పష్టత ఇవ్వలేదు. 

Latest News

 
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM
తిరుమల సమాచారం Tue, Jul 05, 2022, 10:42 AM
ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల Tue, Jul 05, 2022, 10:39 AM
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వెంకటేశ్వర్లు Tue, Jul 05, 2022, 10:35 AM
166 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత Tue, Jul 05, 2022, 10:15 AM