విశాఖ కేంద్రంగా భారీ క్యాంప‌స్ ఏర్పాటు: స్వయంగా ప్రకటించిన ఇన్పోసిస్

by సూర్య | Wed, Jun 22, 2022, 01:24 AM

ఏపీకి దిగ్గజ కంపెనీ ఇన్సోసిస్ రాక కచ్చితమని తేలిపోయింది. ఏపీలోని విశాఖ కేంద్రంగా భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్యాంప‌స్‌లో తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీ ఉండేలా ఇన్పోసిస్ ప్లాన్ చేస్తోంద‌ని, ద‌శ‌ల‌వారీగా దానిని 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.


తాజాగా విశాఖ‌లో భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫోసిస్ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖతో పాటు నాగపూర్‌, కోల్‌క‌తా, ఇండోర్‌, కోయంబ‌త్తూర్‌, నోయిడాల్లోనూ కొత్త‌గా త‌న క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Latest News

 
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM
నేటి నుంచి కబడ్డీ పోటీలు Fri, Jul 01, 2022, 09:30 AM
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM