అనంతపురం టూటౌన్ కానిస్టేబుల్ నిజాయితీ

by సూర్య | Sun, May 22, 2022, 01:08 PM

అనంతపురం టూటౌన్ కానిస్టేబుల్ జగదీష్ నిజాయితీ చాటుకున్నారు. రూ. 40 వేల నగదు, సెల్ ఫోన్ కల్గిన బ్యాగ్ దొరకగా ఆచూకీ కనుగొని బాధితులకు అప్పజెప్పారు. వివరాలు.... స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ జగదీష్ కు కోర్ట్ రోడ్ లోని నెహ్రూ స్కూల్ దగ్గర రోడ్డుపై పడివున్న మహిళా హ్యాండ్ బ్యాగ్ కనిపించింది... మొదట్లో చిరిగిపోయిన హ్యాండ్ బ్యాగ్ పారవేసి పోయారని కానిస్టేబుల్ భావించారు.. పది అడుగుల దూరం వెళ్లిన ఆ కానిస్టేబుల్ అనుమానంతో తిరిగి వచ్చి బ్యాగ్ లో పరిశీలించి చూడగా 40 వేల రూపాయల నగదు... ఒక సెల్ ఫోన్ కనిపించింది ... వెంటనే తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు విషయం చేరవేశారు. అదే సమయంలో హైదరాబాద్ చెఫ్ హోటల్ యజమాని నాయుడు భార్య లక్ష్మీదేవితన బ్యాగ్ పోగొట్టుకున్నట్లు నాల్గవ పట్టణ సి.ఐ జాకీర్ హుస్సేన్ దృష్టికి తీసుకొచ్చారు. సి.ఐ తన సెట్ ద్వారా బ్లూకోల్ట్ పోలీసులకు సమాచారం చేరవేసి సదరు మహిళను పిలిపించి బ్యాగ్ అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.


నిజాయితీగా విధులు నిర్వహించే జగదీష్ గతంలో కూడా ఒక వ్యక్తి మద్యం సేవించి ప్రమాదానికి గురై రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని గమనించిన వెంటనే ఆ వ్యక్తిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.. సంఘటన స్థలంలోనే పడి ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, 50వేల రూపాయల నగదు... చికిత్స అనంతరం అందజేసి మానవత్వంతో పాటు నిజాయితీ చాటుకున్నారు... కానిస్టేబుల్ జగదీష్ ను ఇటు పోలీసు అధికారులు... అటు నగర ప్రజలు హ్యాట్సప్ చెప్తున్నారు.

Latest News

 
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM
వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తా Tue, Apr 23, 2024, 08:07 PM
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? Tue, Apr 23, 2024, 08:07 PM