వ్యాట్ తగ్గించకపోతే జనంలోకి వెళ్తాం: జీవీఎల్ నరసింహారావు

by సూర్య | Sun, May 22, 2022, 12:40 PM

పెట్రోల్, డీజీల్ పై విధించిన వ్యాట్ ను ఏపీలోని వైసీపీ సర్కార్ తగ్గించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.


పెట్రోల్, డీజిల్ పై కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని  పెట్రోల్ పై  రూ.8, డీజిల్ పై రూ.6 తగ్గించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా రిటైల్ ధరలు పెట్రోల్ లీటర్ పై రూ.9.50, డీజిల్ లీటర్ పై రూ.7 తగ్గుతాయని జీవీఎల్ వివరించారు. 6 నెలల వ్యవధిలో రెండుసార్లు భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. 

Latest News

 
ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:20 PM
వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం Fri, Mar 29, 2024, 01:18 PM
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM