పోస్టుమార్టంకు సంతకం పెట్టాలని పోలీసులు కొట్టారు

by సూర్య | Sun, May 22, 2022, 09:37 AM

వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.


ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు.. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ సహా ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.


సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం పూర్తి కాలేదు. మృతుడి కుటుంబసభ్యులు అంగీకరించి సంతకం చేస్తేనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కనిపించకుండా ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.


శవపంచనామా కోసం కుటుంబసభ్యులను తీసుకెళ్లారు. అయితే శవపరీక్ష కోసం సంతకం పెట్టాలని బలవంతం చేస్తున్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని కొట్టారని చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం భార్యను సైతం పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జీజీహెచ్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చేస్తున్న న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ సహా ఎస్సీ సంఘాల నాయకులను పోలీసులు లోపలికి అనుమతించారు. కాకినాడ జీజీహెచ్‌ వద్ద భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM