కాలవ శ్రీనివాసులు అరెస్టును తీవ్రంగా ఖండించిన బండారు శ్రావణి శ్రీ

by సూర్య | Sun, May 22, 2022, 09:31 AM

రాయదుర్గంలో ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవంలో జరిగిన జాప్యంపై తన మాటలను మరోసారి నిరూపించేందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు శనివారం ఉదయం స్వామివారి గుడికి వెళ్తున్న సందర్భంగా ఆత్మకూరు మండలం వడ్డిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ సింగనమల నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణిశ్రీ తీవ్రంగా ఖండించారు.


దేవదేవుడైన వెంకటేశ్వరస్వామి కళ్యాణంలో అపచారం జరిగిందని అడిగితే పోలీసులు అరెస్టు చేయడం దారుణం అని భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి వైకాపా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్లిన తెలుగు దేశం పార్టీ నిజ నిర్ధారణ బృందంపై పోలీసులు జులం ప్రదర్శించడం తగదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజుపై దాడిని ఆమె ఖండించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM