జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి

by సూర్య | Sat, May 21, 2022, 02:14 PM

జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం కావాలి అని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె వి రత్నం పిలుపునిచ్చారు. మే 22 ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా మీదిలాపురి రెవెన్యూ కాలనీలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం పీల్చే గాలిలో రెండు శ్వాసల లో ఆక్సిజన్ లేకుంటే మృత్యువా త పడతా మన్నారు. మనకి ఆక్సిజన్ 50 నుంచి 80 శాతం వరకు సముద్రాల నుండి వస్తున్నారు. అందుకే మనం గాలి పీల్చినప్పుడల్లా సముద్రాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. సముద్రాలు ఆరోగ్యంగా ఉంటేనే సమస్త జీవరాశి మనుగడ ఆనందదాయకంగా ఉంటుంది అన్నారు. సముద్రాలు మనం చెత్త కుండీల వలె వాడితే భవిష్యత్తులో ఆక్సిజన్ దొరకడం కష్టం అవుతుందన్నారు. ఇప్పటికే సముద్రాలలో ఏర్పడుతున్న నిర్జీవ ప్రాంతాలు మనకు ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి అన్నారు. మనం జీవిస్తున్న విధానంలో అత్యధికంగా రసాయనాలు, బార లోహాలు వినియోగిస్తున్నామని ఇవన్నీ వాగులు వంకలు నదులు ద్వారా సముద్రాల లోనికి వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా సముద్రాలలో నిర్జీవ ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలోనికి తీసుకొని మనమంతా సముద్రాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.


విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్ మాట్లాడుతూ సమస్త జీవరాశి జీవిస్తూనే మానవ మనుగడ అన్నారు. తుక్కు కంకణబద్ధులై మనమంతా జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు ప్రస్తుతం జీవరాశి జీవించడానికి అనువైన వాతావరణం లేకుండా పోయిందన్నారు. కొంతమంది చేస్తున్న తప్పులకు అడవులు అంతరించి పోయి సమస్త జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.


ఏడవ తరగతి విద్యార్థిని మాతల చాతుర్య మాట్లాడుతూ తమ తరం, తర్వాత తరాలు హాయిగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. ఈరోజు శీతోష్ణస్థితి వేడెక్కి పోవడం వల్ల ఏర్పడుతున్న అనర్థాలకు తాము ఇబ్బంది పడుతున్నారు


విద్యార్థి మౌన సాయి మాట్లాడుతూ మన పరిసరాల్లో జీవిస్తున్న జీవరాశి కోసం అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరారు. అలాగే మొక్కలు నాటాలని విత్తనాలు సేకరించి విత్తన బంతులు చేయాలని, వర్షాలు కురిసిన తర్వాత విత్తన బంతులు కొండల మీద చల్లాలని కోరారు.


విద్యార్థి నవీన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి జీవ వైవిధ్య పరిరక్షణకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు తామంతా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికంగా పాల్గొని మాట్లాడారు

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM