పల్లకిలో వధూవరుల ఊరేగింపు!!

by సూర్య | Sat, May 21, 2022, 02:07 PM

పూర్వ కాలంలో పల్లకిలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూర్చుంటే నలుగురు బోయలు. (మనుషులు) దానిని మోసుకుంటూ పురవీధుల్లో తిప్పేవారు. ఆ విధంగా వధూవరులను గ్రామస్తులు అందరికీ పరిచయం చేసి వారి ఆశీర్వాదం పొందేవారు. రానురాను పల్లకీలు కాలం పోయి, నేడు కార్లలో ఊరేగుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండి నేటి యువతరానికి గత కాలంలో పల్లకీల గుర్తుకొస్తున్నాయి. అలాగే మండలంలోని తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన కడియాల వారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గ్రామంలో పల్లకి ఎక్కి కూర్చొని ఊరేగారు. పల్లకి ముందు యువకులు కేరింతలు కొడుతూ, రంగులు పులుముకుని, డ్యాన్సులు వేస్తూ గ్రామంలో తిరిగారు. ఇదే విధంగా ఇదే గ్రామంలో కాండ్రేగుల వారి పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె గుర్రాల పల్లకి ఎక్కి గ్రామంలో తిరిగారు. పల్లకీలు పైన, గుర్రపు బగ్గీపై ఊరేగడం అందరినీ ఆకట్టుకుంది. వృద్ధులైతే గత వైభవాలను గుర్తు చేసుకున్నారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM