కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ.. నేతల డిమాండ్

by సూర్య | Sat, May 14, 2022, 11:05 PM

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ వారం 'చింతన్ శిబిర్' అనే మూడు రోజుల మేధోమథన సభను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పార్టీ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ వాద్రా అత్యంత ప్రజాదరణ మహిళ అని కొనియాడారు.

 ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాహుల్ సిద్ధంగా లేకుంటే ప్రియాంక గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో అన్నారు.

ప్రమోద్ కృష్ణ వ్యాఖ్యలకు సోనియా, ప్రియాంక స్పందించలేదు. వెంటనే రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే ఆయనను అడ్డుకున్నారు. ప్రమోద్ కృష్ణకు తోడుగా ఎంపీ దీపేందర్ హుడా గొంతు కలిపారు. ప్రియాంక గాంధీని ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా, జాతీయ స్థాయికి తీసుకురావాలని అన్నారు. ఇదే చర్చలో కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌చార్జి రఘు శర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ఆశ లేదని అన్నారు. చివరిగా కాంగ్రెస్ యువ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడారు. భారత రాజకీయాల్లో వంద సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ కేంద్రంగా ఉందని గుర్తు చేశారు. ప్రతి అంశంలో దేశాన్ని బీజేపీ నిరాశ పర్చిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించగలిగితేనే దేశం పురోగమిస్తుందన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM