దుర్గగుడి దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

by సూర్య | Sat, May 14, 2022, 10:42 PM

దుర్గ గుడి లో హుండీల లెక్కింపు సమయంలో నగదును, బంగారాన్ని కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ బాబురావు నిందితుడి వివరాలను మీడియా కు వెల్లడించారు. ఈ నెల తొమ్మిదిన జరిగిన హుండిల లెక్కింపు సమయంలో కానుకలుగా వచ్చిన కొన్ని బంగారు వస్తువులను తీసి బాత్ రూమ్ లో దాచి ఉంచారని, నిందితులను పట్టుకోవాలని దుర్గగుడి అధికారులు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

 పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆ రోజు ఎంతమంది హుండిల లెక్కింపులో పాల్గొన్నారో వారి వివరాలను ఆలయ అధికారుల నుండి సేకరించారు. 6 వ అంతస్తులో వున్న సి. సి. కెమెరాల ద్వారా హుండిల లెక్కింపు సమయంలో అక్కడ పనిచేస్తున్న వారందరి కదలికలను నిశితంగా పరిశీలించి, అందరిని విచారించారు. అదే గుడిలో అటెండర్ గా పనిచేస్తున్న విజయవాడ మల్లికార్జున పేట ఉప్పరవాగుకు చెందిన కగ్గా పుల్లారావు అలియాస్ పుల్లయ్య నిందితుడుగా గుర్తించారు.

హుండిల లెక్కింపులో అక్రమంగా టాయిలెట్ లో దాచిపెట్టిన బంగారపు వస్తువులను, నాలుగు వేల రూపాయల నగదును అదే తరహాలో అంతకుముందు అక్రమంగా టాయిలెట్ లో దాచిపెట్టిన పదహారు వేల రూపాయల నగదును అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన చేధించి నిందితుడిని అరెస్ట్ చేసి అమ్మవారి సొత్తును రికవరీ చేసిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని అభినందిచారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డులను ప్రకటించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM