అంబటి రాయుడు రిటైర్మెంట్ ట్వీట్‌‌పై సీఎస్‌కే స్పష్టత

by సూర్య | Sat, May 14, 2022, 04:43 PM

ఐపీఎల్-2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ తరుణంలో ఆ జట్టుకు షాకిస్తూ అంబటి రాయుడు శనివారం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం కొద్ది నిమిషాల్లోనే రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ ట్వీట్‌ ఊహించని రీతిలో వైరల్ అయింది. కాసేపటికే తన రిటైర్మెంట్ ట్వీట్‌ను రాయుడు తొలగించాడు. ఈ తరుణంలో రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌పై చెన్నై జట్టు యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. జట్టు పేలవ ప్రదర్శన తట్టుకోలేక రాయుడు అలా ట్వీట్ చేశాడని సీఎస్‌కే సీఈఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదని పేర్కొన్నారు.


సీజన్‌కు తొలుత కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించాడు. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీ పదవికి జడేజా రాజీనామా చేశాడు. ఆ స్థానంలో తిరిగి ధోని బాధ్యతలు స్వీకరించాడు. ఇక జడేజాకు చెన్నై యాజమాన్యంతో గొడవలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే గాయం పేరుతో అతడిని జట్టు నుంచి తప్పించారని కొందరు వాదిస్తున్నారు. ధోని కూడా వచ్చే సీజన్‌లో ఆడడం అనుమానమే. చెన్నై బ్యాటింగ్‌లో వెన్నెముకగా నిలిచిన రైనాను ఇప్పటికే ఆ జట్టు దూరం చేసుకుంది. ఈ తరుణంలో రాయుడు రిటైర్మెంట్ చెన్నై యాజమాన్యానికి షాకిచ్చింది. వరుసగా సీనియర్లంతా దూరమైతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. దీంతో చెన్నై యాజమాన్యం రంగంలోకి దిగి, వెంటనే రిటైర్మెంట్ నిర్ణయాన్ని రాయుడు ఉపసంహరించుకునేలా చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM