ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు అసాధ్యం: బీజేపీ ఎంపీ

by సూర్య | Sat, May 14, 2022, 03:29 PM

ఏపీలో 3 రాజధానులను వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించి, విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. దీనిపై అమరావతి రైతులు కోర్టుకెక్కారు. రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ 3 రాజధానులకు సంబంధించి, మరో కొత్త బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఏపీ మంత్రులు మీడియా ముఖంగా ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు కీలక ప్రకటన చేశారు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు అసాధ్యమని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిందని, దానిపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయలేదని గుర్తు చేశారు. దీంతో 3 రాజధానుల అంశం ముగిసిందనే విషయం వైసీపీకి కూడా తెలుసన్నారు.


ఇక శనివారం ఆయన అమరావతి ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటించారు. తాము అమరావతి రాజధాని అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. దీనిపై రెండేళ్ల క్రితమే తాము స్పష్టం చేశామని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు నిధులు కేటాయిస్తే, మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. మూడు రాజధానుల అంశాన్ని వదిలి, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM