యువతికి గర్భం చేసి ముఖం చాటేసిన ప్రియుడు

by సూర్య | Sat, May 14, 2022, 03:29 PM

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో కొందరు వేస్తున్న వలలో యువతులు పడిపోతున్నారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబితే కరిగిపోతున్నారు. తమ జీవితంలో వారికి చోటిస్తున్నారు. చేసుకోబోయే వాడే కదా అని సన్నిహితంగా మెలిగితే చివరికి గర్భం చేస్తున్నారు. ఆనక పెళ్లి ఊసెత్తితే ముఖం చాటేస్తున్నారు. ఇదే కోవలో ఓ యువతికి మాయ మాటలు చెప్పి దగ్గరైన యువకుడు ఆమెను గర్భం దాల్చేలా చేశాడు. ఆ తరువాత తప్పించుకుని తిరుగుతుండడంతో బాధిత యువతి అతడికి తగిన గుణపాఠం చెప్పింది. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.


ఏపీలోని గ్రేటర్ విశాఖ 64వ వార్డు గంగవరం గ్రామానికి చెందిన యువకుడు చోడిపిల్లి సురేష్‌ (23) సమీప ప్రాంతంలోని యువతి (21)కి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇటీవల సదరు యువతి అస్వస్థతకు గురైంది. తీరా ఆసుపత్రికి వెళ్తే ఆమె గర్భిణీ అని వైద్యులు చెప్పారు. ఈ విషయం వెంటనే ఆమె తన ప్రియుడికి తెలిపింది. తొందరంగా పెళ్లి చేసుకుందాం అని ప్రతిపాదించింది. అయితే పెళ్లి పేరెత్తగా ఆ యువకుడు ససేమిరా అన్నాడు. ఆ యువతి నుంచి తప్పించుకుని తిరగసాగాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. శుక్రవారం తన ప్రియుడిపై న్యూపోర్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యూపోర్టు సీఐ రాము కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM