బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం

by సూర్య | Sat, May 14, 2022, 03:12 PM

తుపాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వ్యవసాయం దండగన్న టీడీపీ నేతలు, స్టీరింగ్ కమిటీ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగ సంక్షేమానికి నాడు వైయ‌స్సార్‌, నేడు వైయ‌స్ జగన్ ఎంతో కృషి చేశారన్నారు.

Latest News

 
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM
కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:26 PM
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM