విజయవాడలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి

by సూర్య | Sat, May 14, 2022, 02:21 PM

 విజయవాడలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఆచార్య ఆనందరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినా స్పందించలేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈక్రమంలో ఆచార్య ఆనందరావును వీసీగా రీకాల్ చేయాలనీ డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నిరసనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శనివారం విజయవాడ ధర్నాచౌక్ నుండి రాజ్ భవన్ కు తరలి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాచౌక్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM