పిటిషన్ లో పేర్కొన్న అంశాలు తప్పు: భారత పురాతత్వ పరిశోధన శాఖ

by సూర్య | Sat, May 14, 2022, 01:53 PM

తాజ్ మహల్ పై వివాదం చేస్తున్న వారికి చెంపపెట్టులాంటి సమాధానాలు వస్తున్నాయి. మొన్నటి వరకు కోర్టు పిటిషన్ దారుడికి చీవాట్లు పెట్టగా, తాజాగా భారత పురాతత్వ పరిశోధన శాఖ కూడా చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది.  ‘తాజ్ మహల్ కింద ఉన్న 22 గదులను తెరిపించండి. అందులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చండి’ అంటూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసిపుచ్చింది. తాజ్ మహల్ ను నిర్మించిన స్థలం జైపూర్ రాజ కుటుంబానికి చెందినదిగా బీజేపీ ఎంపీ దియాకుమారి సైతం ప్రకటించారు. దీంతో తాజ్ మహల్ కింద ఏముంది? అన్న చర్చ మరోసారి మొదలైంది.


అయితే, తాజ్ మహల్ సమాధి కింది భాగంలో ఉన్న సెల్స్ (గదుల మాదిరి) ఎప్పుడూ మూసి ఉంచేవి కావని భారత పురాతత్వ పరిశోధన శాఖ (ఏఎస్ఐ) అధికారులు అంటున్నారు. లక్నో బెంచ్ లో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్న అంశాలు తప్పు అని స్పష్టం చేశారు. ఆ గదులను ఇటీవలే పునరుద్ధరణ పనుల కోసం తెరిచినట్టు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి వరకు పరిశీలించిన అన్ని రికార్డుల ఆధారంగా అక్కడ విగ్రహాలు ఉన్నట్టు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.


తాజ్ మహల్ ప్రాంగణంలో మొత్తం మీద 100 సెల్స్ వరకు ఉంటాయని, రక్షణ, భద్రత దృష్ట్యా వీటిని ప్రజల కోసం తెరవడం లేదని కొందరు భావిస్తున్నారు. లక్నో బెంచ్ లో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నట్టు 11 గదులు శాశ్వతంగా లాక్ చేసినవి కావని పురాతత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాటిని ఇటీవలే తెరిచి నవీకరణ పనులు చేస్తున్నట్టు చెప్పారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM