పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు: వై.ఎస్.షర్మిళ

by సూర్య | Sat, May 14, 2022, 01:40 PM

పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లుపడే పరిస్థితి నెలకొందని తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర‌ విమర్శలు గుప్పించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల గురించి ఆమె ప్ర‌స్తావిస్తూ ట్వీట్లు చేశారు.  ''కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.307కు చేరింది.


ఇక పెరిగిన ఛార్జీలన్నీ 50, 100, 200 యూనిట్ల లోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారం. వైఎస్సార్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఒక్క పైసా పెంచలేదు. కేసీఆర్ గారు మాత్రం పన్నులు పెంచడమే పనిగా పెట్టుకొని పేదోని నడ్డి విరుస్తున్నాడు. పన్నులు, ఛార్జీలు తోచినంత పెంచి జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నాడు'' అని ష‌ర్మిల విమర్శించారు. 

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM