ఓ రాజ్యాన్ని కేసీఆర్ పాలిస్తున్నట్లు ఉంది: ఈటల రాజేందర్

by సూర్య | Sat, May 14, 2022, 01:39 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ పాలన సాగడం లేదని... ఓ రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ కేసీఆర్ పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 


ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చడం లేదని ఈటల అన్నారు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ముగింపు పలికేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు. అమిత్ షా సభా ప్రాంగణాన్ని ఈరోజు ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM