108 రాలేదు.. ప్రాణాలు నిలవలేదు

by సూర్య | Sat, May 14, 2022, 01:28 PM

చిత్తూరు: ములకలచెరువు శ్రీకన్యక పరమేశ్వరి ఆలయ అర్చకుడు శ్రీనివాస్‌ శుక్రవారం 108 సకాలంలో రాక. ప్రాణాలు కాపాడుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లె మండలానికి చెందిన అర్చకుడు శ్రీనివాస్‌ గత 15 ఏళ్ల క్రితం ములకలచెరువుకు చేరుకున్నారు. స్థానిక కన్యపరమేశ్వరి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. గుండెపోటు రావడంతో ములకలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్‌ చేశారు. ములకలచెరువు 108 వాహనంలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు కావడంతో బి. కొత్తకోట 108కు ఫోన్‌ చేశారు. 


108 వాహనం రావడంలో జాప్యం కావడంతో ప్రైవేట్‌ వాహనంలో మదనపల్లె వెళ్తుండగా మార్గం మధ్యలో పెద్దపాళ్యంలో 108 ఎదురొచ్చింది. అక్కడ వాహనం ఎక్కించుకొని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన పరికరాలు, అందుబాటులో వైద్యులు లేకపోవడంతో మదనపల్లెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM