కులం పేరుతో దూషించారని పుల్లారావుపై పిర్యాదు

by సూర్య | Sat, May 14, 2022, 01:22 PM

చిలకలూరిపేటలోని మంచినీటి చెరువు దగ్గర నిన్న ఈ ఘటన జరిగింది.  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించేందుకు చిలకలూరిపేటకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ సుజల పధకానికి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవం చేయకుండా పుల్లారావు పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు - టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే  టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు అందినట్లు పోలీస్ వారు తెలియచేసారు. వివరాల్లోకి వెళ్ళితే....  గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కులం పేరుతో దూషించారని ప్రభుత్వ ఉద్యోగిని నుంచి ఫిర్యాదు అందడంతో టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3 గా బండారుపల్లి సత్యానారాయణ, ఏ4గా శ్రీనివాసరావును కేసులో చేర్చారు. ఈ మేరకు 323,34,353,506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరు వివరాలు తెలియాల్సి ఉంది.  

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM