రెప్పపాటులో ప్రమాదం రాగోలు యువకుడు మరణం

by సూర్య | Sat, May 14, 2022, 09:59 AM

విజయనగరం జిల్లా గుర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన మజ్జి అచ్యుత నాయుడు (21) బొండపల్లి మండలంలో గొట్లాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాగోలు గ్రామానికి చెందిన యువకుడు తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తగా పని చేస్తున్నాడు. బొబ్బిలి గ్రామం లో తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి డీజే వ్యాను పట్టుకుని వస్తుండగా రెప్పపాటులో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అచ్యుత నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఎంతో సరదాగా ఉండే నాయుడులేకపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఒక్కసారి ఎలా జరగడంతో తండ్రి లబోదిబోమంటున్నారు. గ్రామములో ఎంతో సరదాగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇది జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి పట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM