త‌హ‌శీల్దార్ స్థాయిలోనే అడంగ‌ల్ స‌వ‌ర‌ణలు: కలెక్టర్

by సూర్య | Sat, May 14, 2022, 09:53 AM

భూముల‌కు సంబంధించిన‌ అడంగ‌ల్ స‌వ‌ర‌ణ‌లు అన‌గా పేర్లు త‌ప్పుగా పడ‌టం, ఆన్లైన్‌లో సున్నా చూపించ‌టం, విస్తీర్ణంలో తేడాలు, వ‌ర్గీక‌ర‌ణ మార్పులు ఇక నుంచి త‌హ‌శీల్దార్ స్థాయిలోనే ప‌రిష్కారం అవుతాయ‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇక నుంచి సంబంధిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌జ‌లు క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు రావాల్సిన పని లేద‌ని స్ప‌ష్టం చేశారు. స‌ద‌రు మార్పుల విష‌య‌మై ఇక నుంచి స్థానిక స‌చివాల‌యంలో లేదా మీసేవ‌ల్లో ద‌ర‌ఖాస్తు చేసిన యెడ‌ల ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు త‌హ‌శీల్దార్ చ‌ర్య‌లు తీసుకుంటార‌ని పేర్కొన్నారు. భూ ప‌రిపాల‌నా శాఖ ముఖ్య క‌మిష‌న‌ర్ వారి ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలోని త‌హ‌శీల్దార్ల‌కు ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన‌ట్లు ఆమె తెలిపారు.

Latest News

 
ఏపీ రోడ్ల దుస్థితి పై చినజీయర్ స్వామి వ్యంగం Thu, May 19, 2022, 08:49 PM
రేపటి నుంచి విదేశీ పర్యటనలో సీఎం జగన్‌ Thu, May 19, 2022, 08:43 PM
టమాటా ధరలుపై ఏపీ సర్కర్ కీలక నిర్ణయం Thu, May 19, 2022, 08:38 PM
రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధం: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:34 PM
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM