రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు

by సూర్య | Sat, May 14, 2022, 09:50 AM

రోడ్డు ప్రమాదంలో సాయిచరణ్ రెడ్డి అనే విద్యార్థికి గాయాలైనట్లు చింతకొమ్మదిన్నె హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కథనం మేరకు కడప అన్నమాచార్య కళాశాలలో చదివే సాయిచరణ్ రెడ్డి రోజు మాదిరిగానే శుక్రవారం కూడా కళాశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రాయచోటి రోడ్డులోని ఊటుకూరు వద్ద ఎస్వీ శుభం కల్యాణమండపం వద్ద బస్సుకు సైడు ఇవ్వబోయి ఆగిఉన్న కారును ఢీకొన్నాడు. దీంతో అదుపుతప్పి కిందపడిపోయి తీవ్ర గాయాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయిచరణ్ రెడ్డి మేనమామ ఉపేంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Latest News

 
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM
ఏపీ రోడ్ల దుస్థితి పై చినజీయర్ స్వామి వ్యంగం Thu, May 19, 2022, 08:49 PM