నీటి గుంతలో పడి బాలుడు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:49 AM

నిర్మాణంలో ఉన్న ఓ నీటి గుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన కడప నగరంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవుని కడపకు చెందిన బాలకృష్ణ, యల్లమ్మ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి అయి దుగురు పిల్లలుండగా నాలుగో సంతానం బాబుజ్జ (6), ఈ క్రమంలో వీరి నివాస సమీపంలో ఆర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కొన్ని రోజుల కిందట తీసిన గుంతలు రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలతో నిండిపోయాయి.


బాబుజ్జ తోటి చిన్నారులతో కలిసి ఆడుకునేందుకు శుక్రవారం బయటికి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. వెంటనే తోటి పిల్లలు పెద్దలకు సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి బాలుడిని గుంతలో నుంచి బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. కొన్ని నెలల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ గునాదులకే పరిమితమైంది. నిర్మాణం పూర్తి అయి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM