సమాజంలో మనుషుల ఆలోచనా ధోరణి మారాలి

by సూర్య | Sat, May 14, 2022, 09:47 AM

సమాజంలో మహిళల పట్ల పురుషుల ఆలోచన ధోరనిమారి వారిపై గౌరవ, పూజ్య భావం పెంపొందించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు జి. వెంకట లక్ష్మి పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని "సఖి" (వన్ స్టాప్ సెంటర్) సెంటర్ లో ప్రొద్దుటూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ఆమె విలేఖరుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకట లక్ష్మీ మాట్లాడుతూ భాదితురాలును తాను పరామర్శించి ఆమెతో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాను ఇవ్వడం జరిగిందన్నారు. మానసిక రుగ్మతలతో ఏమిజరుగుతుందో తెలియని అమాయక స్థితిలో ఉన్న ఆమె కీచకుల చేత మోసపోవడం జరిగిందన్నారు. అదేవిధంగా తాను తప్పు చేస్తూ తన స్నేహితుడిని కూడా పురమాయించడం అతను కూడా ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లి బలత్కారం చేయడం జరిగిందన్నారు.


మానసిక స్థితి బాగాలేని అమ్మాయిపై ఇలాంటి దురాగతాలకు పాల్పడిన వారిలో ఇద్దరు వ్యక్తుల పేర్లను అమ్మాయి చెబుతోందన్నారు. తల్లి లేని తండ్రి బిక్షాటనకు వెళ్తుండడం పైగా మతిస్థిమితం లేని ఈమెకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నదన్నారు. ప్రస్తుతం బాధిత యువతికి ఒక పునరావాస కేంద్రంలో వైద్యం కూడా చేయిస్తున్నామని తెలిపారు. ఆమెకు న్యాయం జరిగే విధంగా నిందితులను పూర్తి స్థాయిలో విచారించి శిక్ష పడేలా చేస్తామన్నారు.


ఈ కేసులో ఎంతమంది హస్తం వున్నా, ఎంతటి వారైనా ఉపేక్షించబోమని చెబుతూ పోలీసులచే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో తాను మాట్లాడడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితులు ఇద్దరే కాకుండా ఇంకా సుమారు 10 మంది దాకా నిందితులు ఉన్నట్లు పలు పత్రికలు ప్రచురితం చేశారన్నారు. ఇందులో ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


ఈ సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా స్పందించడం జరిగిందన్నారు. ఎవరైతే కేసులో నిందితులుగా ఉన్నారో వారందరికీ కఠిన శిక్ష, యావత్ జీవ కారాగారశిక్ష, అంతకంటే ఎక్కువగా శిక్ష విధించే విధంగా న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న కీచకులను నియంత్రించేందుకు దిశా చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అయితే అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఆడబిడ్డలను మన బిడ్డలుగా అక్కా, చెల్లి, తల్లిగా భావించి చూడాలని అన్నారు.


ఇటీవల రమ్య హత్య కేసులో నిందితులకు తొమ్మిది నెలల కాలంలోనే ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును ఇవ్వడం మనందరికి తెలిసిందే నన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ఎన్. రాణి, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అశ్వని తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM