లింగాల లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by సూర్య | Sat, May 14, 2022, 09:46 AM

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం వెలిదండ్ల సమీప ఎర్రకుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు వెలిదండ్ల ఎర్రకుంటలో సుమారు 45 ఏళ్లు కలిగిన ఒక మృతదేహం పడి ఉన్నట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన ప్రదేశంలో పరిశీలిస్తే మృతదేహానికి బట్టలు లేకపోవడం, ఒక ఇనుపకడ్డీ ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా చంపివేశారా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హృషికేశ్వరరెడ్డి తెలిపారు.

Latest News

 
గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాష Tue, Nov 29, 2022, 01:11 PM
కూతురికి గుడి కట్టిన తండ్రి Tue, Nov 29, 2022, 12:17 PM
సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత పై సమీక్ష నిర్వహించిన ఎస్పీ Tue, Nov 29, 2022, 11:58 AM
గణనాధుని సేవలో టీటీడీ బోర్డు సభ్యులు Tue, Nov 29, 2022, 11:57 AM
అభివృద్ధి పనులకు శ్రీకారం Tue, Nov 29, 2022, 11:46 AM