మహిళల ఆర్థిక స్వావలంబన ప్రభుత్వ ధ్యేయం, ఎంపీపీ,.

by సూర్య | Sat, May 14, 2022, 09:37 AM

సమాజంలో సగ భాగమైన మహిళల స్వయం ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తెలిపారు.


స్థానిక క్రాంతి మండల సమైక్య కార్యాలయంలో వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యాప్తంగా 56 గ్రామాల పరిధిలోని 1255 మహిళా సంఘాలకు 2, 13 కోట్ల ల వడ్డీని మూడో విడతగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సగమైన మహిళల ఆర్థిక స్వావలంబన పొందిన సమాజ సమగ్రాభివృద్ధి సాధ్యమని, ఎటువంటి వివక్షతకు గురి కాకుండా స్వయం ఉపాధి సమృద్ధి సాధించాలన్న ఆశయంతో మహిళా సంఘాల పరిపుష్టి, రుణ భారం తగ్గించాలన్న లక్ష్యంతో బ్యాంకులకు మహిళా సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది అన్నారు. మహిళా సంఘాల ద్వారా చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. మహిళ ఆర్థిక స్వావలంబన ద్వారా పలు కుటుంబాలకు జీవన ఉపాధి లభిస్తుందన్నారు.


ఈ కార్యక్రమంలో లో జెడ్ పి టి సి తిరుమల సేవే నాయక్, సర్పంచ్ లక్ష్మీదేవి చండ్రయుడు, సమాఖ్య అధ్యక్షురాలు పద్మావతి ఏపీఎం హేమలత సీసీలు వివోలు వివో లీడర్లు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM