ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ చూపాలి

by సూర్య | Sat, May 14, 2022, 09:32 AM

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎంఈఓ శ్రీదేవి పేర్కొన్నారు. పుట్లూరు మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో శుక్రవారం ఆ అంశంపై ఉపాధ్యాయులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ. వేసవి సెలవుల్లో పుస్తక పఠన ప్రాధాన్యతను విద్యార్థులు గ్రహించేలా చేయాలని, బాలబాలికలు ఇంటి పట్టున ఉంటూ వివిధ రకాల పుస్తకాలను చదువుతూ నైపుణ్యాలు పెంపొందిం చుకునేలా తోడ్పాటు అందించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లోని వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీవో యోగానంద రెడ్డి, ఆర్పీ అమీర్బషా, ప్రధానోపాధ్యా యులు పాల్గొన్నారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM