కానిస్టేబుల్ పై వేధింపుల కేసు

by సూర్య | Sat, May 14, 2022, 09:31 AM

కట్నం పేరుతో భార్యను వేధిస్తున్న ఓ కానిస్టేబుల్పై 'దిశ' పోలీ స్ స్టేషన్లో కేసు నమోదైంది. శింగనమల మండలం గురుగుంట్లకు చెందిన పవన్ కుమార్ నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి అనంత పురానికి చెందిన యువతితో 2013లో పెళ్లయ్యింది. వివాహ సమయంలో రూ. 2లక్షల నగదు, 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగా సాగినా, తర్వాత అదనపు కట్నం పేరుతో పవన్ కుమార్ వేధింపులు మొదలు పెట్టాడు. పెద్దలు పంచాయితీ చేసినా మార్పు రాలేదు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు మరో రూ. లక్ష నగదు ఇచ్చారు. సంతృప్తి చెందకుండా మరింత హింసించేవాడు. దీనికితోడు వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను నిర్లక్ష్యం చేశాడు. మనస్తాపానికి గురైన బాధితురాలు 'దిశ' స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Latest News

 
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM
కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:26 PM
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM