వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది

by సూర్య | Sat, May 14, 2022, 09:30 AM

వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంకరి కమలమ్మ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కడప జిల్లాలో మహిళపై అఘాయిత్యం జరిగితే స్పందించని పోలీసులు మాజీ ఎంపి సోదరుడు ప్రస్తుతం మున్సిపలైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి గుంపులు గుంపులుగా పోలీసులు బయలుదేరి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె దుయ్యబట్టారు.


అరెస్ట్ చేయడానికి ఒకరిద్దరు సరిపోతారని కానీ కేవలం సిఎం జగన్ మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి పోలీసులు ఆరాటం చెందుతు న్నారన్నారు. పోలీసు స్టేషన్లలో వైసిపి వారికి తప్పించి తెలుగుదేశంపార్టీ, సామాన్యులకు న్యాయం జరగడం కలగా మారిందన్నారు.


ఒక రబ్బర్ స్టాంప్ హోంమినిస్టర్ వచ్చిందన్నారు. ఒక దళిత మహిళ హోం మినిస్టర్గా వుండి రేప్ అనుకోకుండా జరిగింది అంటూ నిందితులను వెనుకేసుకొచ్చే దోరణిలో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.


ఆడవారికి అన్యాయం జరిగితే గన్ కంటే జగన్ వస్తారు అన్న రోజా నేడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఘటన గురించి ఏం చెబుతారని ప్రశ్నించింది. మంత్రులు ఇప్పటికైనా భజనలు మాని బాధ్యతలు తెలుసుకుని నడుచుకోవాలని ఆమె పేర్కొన్నారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM