మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు : ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

by సూర్య | Sat, May 14, 2022, 08:56 AM

మహిళల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ దిశ యాప్ ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రమాదంలో ఉన్న సమ యంలో రెడ్ బటన్ నొక్కితే ఆ వ్యక్తి ప్రమాదం ఉన్నారని గుర్తించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షిస్తారని చెప్పారు. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఈ యాప్ను రూపొందించిందని వివ రించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కృషి చేస్తోందని వివరించారు. అనంతరం పలువురు మహిళల సెల్ ఫోన్లలో యాపను డౌన్లోడ్ చేశారు. డీఎస్పీ సత్యా నంద్, పామర్రు ఇన్చార్జి సీఐ ఎం. ముక్తేశ్వరరావు, పామర్రు ఎస్పీలు అవినాష్, మాణిక్యాలరావు,


వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ డి. బాలవెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ టి. శ్రీనివా సరావు, పార్టీ నాయకులు ఆరుమళ్ల శ్రీనాథ్ రెడ్డి, నరసింహారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


 


 

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM