చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌పైనున్న కేసు కొట్టివేత

by సూర్య | Sat, May 14, 2022, 02:08 AM

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌ కు ప్రజా ప్రతినిధు కోర్టులో ఊరాట లబించింది. ఆయనపై న‌మోదైన కేసును విజ‌య‌వాడ‌లోని ప్రజా ప్ర‌తినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం నాడు ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు...చింత‌మ‌నేనిపై అభియోగాల‌ను పోలీసులు నిరూపించ‌లేక‌పోయార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే చింత‌మ‌నేనిపై కేసును కొట్టివేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌కటించింది.


2011లో ఓ మ‌హిళ‌పై దాడి చేశారంటూ చింత‌మ‌నేనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఆయ‌న‌పై ఏలూరు పోలీస్ స్టేష‌న్‌లో ఓ కేసు న‌మోదైంది. ఈ కేసుపై సుదీర్ఘ విచార‌ణ జ‌ర‌గ‌గా... కేసులో చింత‌మ‌నేనిపై న‌మోదు చేసిన అభియోగాలు రుజువు కాలేదు. దీంతోనే కోర్టు ఆయ‌న‌పై న‌మోదైన ఈ కేసును కొట్టివేసింది.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM