ట్విట్టర్ డీల్ ను పక్కనెట్టిన ఎలాన్ మస్క్

by సూర్య | Sat, May 14, 2022, 02:07 AM

ట్విట్టర్ కు అమెరికా కుభేరుడు ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అందుకే డీల్ ను హోల్డ్ లో పెడుతున్నానని ఆయన తెలిపారు. 


మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోంది. అయితే ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలను అందించాలని మస్క్ డిమాండ్ చేశారు. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్టు చెప్పారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ షేర్ల విలువ ఏకంగా 20 శాతం పడిపోయింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయాలనుకున్న సంగతి తెలిసిందే.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM