త్వరలో తిరుమలలో 'కల్యాణమస్తు' కార్యక్రమo ప్రారంభం

by సూర్య | Fri, May 13, 2022, 08:50 PM

టీటీడీ భక్తులకు శుభవార్త తెలిపింది. ఆకాశగంగలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా పేదలకు ఆర్థిక భారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచిత కళ్యాణం పధకం 'కల్యాణమస్తు' కార్యక్రమo త్వరలో ప్రారంభం కానుందని,ఇది  పేదలకుఎంతో ఉపయోగకరమని  టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ప్రోటోకాల్ ప్రకారం వీఐపీ బ్రేక్‌లు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం, కాబట్టి ఈ బ్రేక్ వల్ల  సామాన్య భక్తులు ఎక్కువగా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు నిత్యం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Latest News

 
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM
వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తా Tue, Apr 23, 2024, 08:07 PM
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? Tue, Apr 23, 2024, 08:07 PM