నా పాదయాత్రలో మత్స్యకారుల బాధలను విన్నాను, నేనున్నాను: సీఎం జగన్

by సూర్య | Fri, May 13, 2022, 07:01 PM

ఏపీ లో ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం మురమళ్లలో మత్స్యకార సంక్షేమ కార్యక్రమం-`వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా' ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మద్దతుతో విజయం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజకీయాల్లో 40 ఏళ్లుగా ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఓడిపోయిన సొంత కొడుకు (లోకేష్), తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలవలేకపోయిన పెంపుడు కొడుకు (పవన్ కళ్యాణ్) మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు అని ఎద్దేవా చేసారు.

పేదల కోసం 32 సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చిన వైయస్సార్ ప్ర్రభుత్వం పై టీడీపీ  ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుందని మండిపడ్డారు. “నా పాదయాత్రలో మత్స్యకారుల కుటుంబాల బాధలను విన్నాను అందుకే నేనున్నాను, వారిని ఆదుకుంటానని ప్రతిజ్ఞ చేసాను. అందుకే ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి రూ.109 కోట్లు జమ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా ఇలాంటివి జరగలేదు. ఓఎన్‌జీసీ తమ ప్రాంతంలో పైప్‌లైన్‌ డ్రిల్లింగ్‌ ప్రాజెక్టు చేపట్టే సమయంలో పని లేకుండా పోతున్న 68 గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలకు నాలుగు నెలల పాటు నెలకు రూ.11,500 చొప్పున అందజేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఏ ప్రభుత్వమూ వారిని ఆదుకో లేదు. గత ప్రభుత్వం మొత్తం పదవీకాలంలో రూ.104 మాత్రమే ఇస్తే, ఇప్పుడు ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నామని, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కూడా అందిస్తున్నామని ఆయన దృష్టికి తెచ్చారు.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM