![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 06:20 PM
ఏపీ ప్రజలు నిరాశలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యవస్థ ధ్వంసమైతే పునర్నిర్మించడం చాలా కష్టమని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. ఏపీలో హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వ్యక్తిగత అభివృద్ధి కంటే వ్యవస్థ అభివృద్ధి ముఖ్యం. వ్యవస్థ అభివృద్ధికి తాను ప్రాధాన్యత ఇస్తుంటే.. ప్రస్తుత పాలకులు వ్యక్తి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఏపీ రాష్ట్రంలో అరాచకం సాగుతోందని ధ్వజమెత్తారు. చివరకు నా పై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, మూర్ఖులు, రౌడీలు, అమాయకులతో పోరాడాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు.
Latest News