యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు మృతి

by సూర్య | Fri, May 13, 2022, 05:04 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్(73) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. షేక్‌ ఖలీపా 1948 లో జన్మించారు.

యూఏఈకి రెండో అధ్యక్షుడిగా ఉన్నారు. అబుదాబికి పదహారవ పాలకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. షేక్‌ ఖలీఫా మృతికి సంతాపంగా ఆ దేశంలో 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM