![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 04:58 PM
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో చైర్మన్ వీరిద్దరినీ కలసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఢిల్లీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి పాల్గొన్నారు.
Latest News