లావాదేవీలు రూ.20 ల‌క్ష‌లు దాటితే ఇవి తప్పనిసరి

by సూర్య | Fri, May 13, 2022, 03:49 PM

బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రూ.20 లక్షలు డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా ఆధార్, పాన్ సంఖ్యలను తెలపాలని సూచించింది. ఏడాదిలో రూ.20 లక్షలకు మించి జరిపే లావాదేవీలపైనా ఈ నిబంధన తప్పనిసరి అని తెలిపింది. తాజా నిబంధనపై సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో క‌రెంట్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే ప్యాన్, ఆధార్ సంఖ్య‌ను చెప్పడం తప్పని సరి అని స్పష్టం చేసింది. పోస్టాఫీసుల్లో క్యాష్ క్రెడిట్ అకౌంట్‌ ఓపెన్ చేసే విషయంలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.


సీబీడీటీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో వివరాలిలా ఉన్నాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్, ఉపసంహరణ లావాదేవీలు కలిగి ఉంటాయి. ఖాతాలు వాణిజ్య బ్యాంకులో మాత్రమే కాకుండా సహకార బ్యాంకులు, పోస్టాఫీసులలో కూడా ఈ లావాదేవీలు ఉంటాయి. ఇక ఒక్క రోజులో రూ.50 వేలు, అంతకు మించి డిపాజిట్ చేసినా, పాన్‌ నంబరును తెలియజేయాల్సిన అవసరం ఉంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM