పిల్లి అనుకుని చిరుత పిల్లను ఇంటికి తెచ్చిన చిన్నారి

by సూర్య | Fri, May 13, 2022, 03:42 PM

మహారాష్ట్ర మాలేగావ్​ లోని మోర్జార్​ శివరా ప్రాంతంలో ఓ చిన్నారి పిల్లి అనుకుని చిరుత పిల్లను ఇంటికి తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు కూడా మొదట దానిని పిల్లికూన అనే అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి అది చిరుత పిల్ల అని తెలియడంతో భయపడిపోయారు. అయితే ఆ చిరుత పిల్ల చిన్నది కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


చిన్నారి చిముకల్య ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు దారిలో కనిపించిన చిరుత పిల్లను పిల్లి అనుకుని వెంట తెచ్చుకుంది. ఏ క్షణంలోనైనా ఆ చిరుత కూన కోసం తల్లి రావొచ్చని భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆ చిరుత పిల్లను వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. తల్లి చిరుత జాడ లేకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అరవింద్ బాబు నివాళులు Wed, Jul 06, 2022, 04:26 PM
లంకలా మారకుండా వుండాలంటే అప్పులు కట్టాలి Wed, Jul 06, 2022, 04:13 PM
కాకినాడ లో వైసీపీ ప్లీనరీ Wed, Jul 06, 2022, 03:56 PM
నా సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు Wed, Jul 06, 2022, 03:55 PM
8 వ తారీఖున నగరికి చంద్రబాబు నాయుడు Wed, Jul 06, 2022, 03:55 PM