![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 03:39 PM
కోవిడ్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో 'వైఎస్సార్ మత్స్యకార భరోసా'పై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు తాము మంచి చేస్తుంటే దుష్టచతుష్టయమైన ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా విషం కక్కుతోందని జగన్ అన్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలు బైబిల్, ఖురాన్, భగవద్దీతలుగా భావించినట్లు చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అయితే ఓర్వలేని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు.
పేదలకు రూ.లక్షా 40 వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల రూపంలో అందించిన ఘనత వైసీపీ సర్కారుకు దక్కుతుందని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు తాను పేదలకు ఏం చేశానో చెపపుకోలేని స్థితిలో ఉన్నాడని వ్యాఖ్యనించారు. పరీక్షల పేపర్లను టీడీపీ కీలక నాయకుడు, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ లీక్ చేశాడని సీఎం అన్నారు. వారే తప్పులన్నీ చేసి, వాటిని ప్రభుత్వం మీదకు నెట్టేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని కళ్లు ఉండీ చూడలేని కబోధులని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పునాదులు కదిలాయని, ఇన్నాళ్లు లేని విధంగా తాజాగా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని అన్నారు.
Latest News