![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 03:34 PM
చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని ఆయన కోరారు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, గీతగా భావించాం. ప్రతీ మత్స్యకారుడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మండలం) మురమళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ మత్స్యకార భరో్సా కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.
Latest News