విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి: మంత్రి ఆదిమూలం

by సూర్య | Wed, Jan 19, 2022, 09:46 PM

ఏపీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు కొనసాగుతున్నప్పటికీ... ఏపీలో మాత్రం స్కూళ్లు తెరిచారు. మరోవైపు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కరోనా బహిర్గతం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ స్థాయిలో పాఠశాలల పరిస్థితిని ప్రతి రోజూ సమీక్షిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన ఉపాధ్యాయులకు తక్షణమే సెలవు ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని పాఠశాలలను శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలకు లోబడి పాఠశాలలకు హాజరు కావాలని చెప్పారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM