మాట్లాడేది లేదు సమ్మెలోకే: ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

by సూర్య | Wed, Jan 19, 2022, 08:25 PM

పిఆర్సి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వార్ ఉదృతం అవుతుంది.


ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య గత కొంత కాలంగా పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే అవకాశమే తమకు రాలేదని చెప్పారు. పీఆర్సీపై సీఎం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని, తాము ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాలే కానీ, తగ్గవని అన్నారు. తమను ఇంత మోసం చేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్కేల్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? అని అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ఆదాయం లేవనే చెపుతాయని... రాష్ట్ర విభజన వల్ల ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని... ఆయన అబద్ధాలు చెప్పారని అనుకోవాలా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి రెడ్డి చేసిన ట్వీట్ ను చూపించారు. ఇకపై మాటలు, చర్చలు ఉండవని... ఈనెల 21 సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM