ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. మరో పన్ను వసూలుకు రంగం సిద్ధం

by సూర్య | Wed, Jan 19, 2022, 05:06 PM

ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది, మరో పన్ను వసూలుకు రంగం సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో నిర్మాణాలపై నాలా పన్ను విధించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు సర్వే నిర్వహించారు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు ఉంటే.. నాలా పన్ను, జరిమానా విధిస్తూ క్రమబద్ధీకరించాలని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర భూముల్లో నిర్మాణాలకు సంబంధించిన డేటాను సేకరించిన అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిర్ణీత గడువులోగా నోటీసులు క్రమబద్ధీకరించకుంటే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ భూమిలో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓటీసీ వసూళ్ల బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వ భూమి విలువపై 5 శాతం పెనాల్టీతో నాలా పన్ను విధిస్తారు.

Latest News

 
జనసేన పార్టీకి గుడ్‌న్యూస్.. ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Tue, Apr 16, 2024, 07:22 PM
వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష.. 28 ఏళ్ల కిందటి కేసులో కోర్టు తీర్పు Tue, Apr 16, 2024, 07:17 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల్ని బుక్ చేస్కోండి Tue, Apr 16, 2024, 07:10 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం 5 రూపాయలే.. Tue, Apr 16, 2024, 07:06 PM
భర్తల కోసం రంగంలోకి నేతల సతీమణులు...ఏపీలో ఆసక్తికర సీన్ Tue, Apr 16, 2024, 07:03 PM