ఊహించినట్లుగానే...ఏపీలో నైట్ కర్ఫ్యూ

by సూర్య | Tue, Jan 18, 2022, 07:25 PM

అందరూ అనుకొన్నట్లే సంక్రాంతి అనంతరమే ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుండగా, నేడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో నిన్న 4 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు 7 వేలకు చేరువలో కొత్త కేసులు వెల్లడయ్యాయి.


రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ


రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ


వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.


చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు మినహాయింపు


విమానాశ్రాయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపు


షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా.


నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి


ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి


సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.

Latest News

 
సత్యప్రసాద్ నామినేషన్ కు ప్రజలు భారీగా తరలి రావాలి Wed, Apr 24, 2024, 01:14 PM
పొగాకు అత్యధిక ధర రూ. 270 Wed, Apr 24, 2024, 01:11 PM
హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ Wed, Apr 24, 2024, 01:09 PM
టీవీ పగలగొట్టి ఆవేదన చెందిన టీడీపి కార్యకర్త Wed, Apr 24, 2024, 01:06 PM
రిటైర్డ్ వి ఆర్ ఓ ను పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Apr 24, 2024, 01:05 PM