అల్లు అర్జున్ బ్రాండ్ తోనే మెగా ఫ్యామీలి గుర్తించబడుతుంది

by సూర్య | Tue, Jan 18, 2022, 03:45 PM

భవిష్యత్ లో మెగా కుటుంబ సభ్యులందరూ.. భారత్ లో ఏ మూలకు వెళ్లినా అల్లు అర్జున్ బంధువులుగానే తెలుస్తారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వవర్మ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆడిపోసుకునే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద పడ్డారు. చిరంజీవి కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో మెగా కుటుంబ సభ్యులందరూ.. భారత్ లో ఏ మూలకు వెళ్లినా అల్లు అర్జున్ బంధువులుగానే తెలుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మెగా కుటుంబంతో డైరెక్ట్ గా రక్త సంబంధం లేకపోయినప్పటికీ... ఆ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే మెగా అని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో ‘ఒమెగా’ అవుతాడంటూ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ ఆధునిక తరం రజనీకాంత్ అంటూ కొనియాడారు. సహజ సిద్ధంగా ఉండే విశ్వాసం, బయటకు కనిపించే తీరు రజనీకాంత్ ను చిరంజీవి లాంటి ఇతర కుటుంబాలతో పోలిస్తే పదిరెట్లు ఎత్తులో ఉంటారన్నారు. కాబట్టి అతడి సృష్టి పట్ల అల్లు అరవింద్ మెగా ప్రౌడ్ గా ఉండాలంటూ ట్వీట్ చేశారు. అయితే, కాసేపటికే ‘అల్లు అర్జున్ బంధువులు’ అనే ఒక్క ట్వీట్ ను మాత్రమే ఉంచిన వర్మ.. మిగతా రెండు ట్వీట్లను మాత్రం తొలగించేశారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM