ఆ రైతులకు అలర్ట్... !

by సూర్య | Tue, Jan 18, 2022, 12:49 PM

కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. అయితే ఈ పథకం కింద రైతులు డబ్బులు పొందాలంటే ఈ-కేవైసీ ని తప్పని సరి చేసింది ప్రభుత్వం. లేకుంటే నగదు జమలో ఇబ్బందులు తప్పవు. రైతులు ఆధార్ ఓటీపీ, ఆధార్ బయోమెట్రిక్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
*ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసి పూర్తి చేసే విధానం:
-మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈ-కేవైసికి అవకాశం ఉంటుంది.
-మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
-హోమ్ పేజీలో కనిపించే "ఈ-కేవైసి" ఆప్షన్ ఎంచుకోవాలి.
-ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
-ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేసి "గెట్ ఓటీపీ" క్లిక్ చేయాలి.
-ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ నమోదు చేసి "Submit For Auth" మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌ ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది.

Latest News

 
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM
నేడు గిద్దలూరు కు భాస్కర్ రెడ్డి Fri, Mar 29, 2024, 01:35 PM
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Fri, Mar 29, 2024, 01:34 PM