ఏపీలో నేటి నుంచి ఆంక్షలు..

by సూర్య | Tue, Jan 18, 2022, 07:56 AM

ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. మంగళవారం (18వ తేదీ) నుంచి ఈ నెల 30 వరకు ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. అయితే అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎమర్జెన్సీ విధుల్లో ఉంటే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందికి కూడా విధి నిర్వహణలో గుర్తింపు కార్డులు చూపించి ఆంక్షల నుండి మినహాయింపు పొందవచ్చు. అంతరాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు సాగించే వారు తమ ప్రయాణ టికెట్ చూపించి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లుకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.


మిగతా అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


-మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తారు


- పెళ్లిళ్లు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంతి, ఇన్ డోర్ లో అయితే 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. హజరయ్యే వారంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.


-దేవాలయాలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లల్లో భౌతిక దూరంతో పాటు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

Latest News

 
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి Thu, Mar 28, 2024, 01:46 PM
మాజీమంత్రి కిమిడి కళా పోటీ ఎక్కడి నుంచి ? Thu, Mar 28, 2024, 01:43 PM
హెల్మెట్ వాడకంపై అవగాహన Thu, Mar 28, 2024, 01:41 PM
ఓటు హక్కుపై అవగాహనా ర్యాలీ Thu, Mar 28, 2024, 01:40 PM
దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి Thu, Mar 28, 2024, 01:37 PM